English   

మ‌హ‌ర్షి వాయిదా ప‌డిందిగా.. నాగ‌చైత‌న్యకు పండ‌గే మ‌రి.. 

Mahesh-Babu
2019-01-23 06:14:35

అనుకున్నదే జరిగింది.. మహర్షి సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుందని అప్పుడెప్పుడో కన్ఫర్మ్ చేశాడు దిల్ రాజు. అయితే ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మళ్ళీ ఆయనే ప్రకటించాడు. ఏప్రిల్ 5 నుంచి మరో 20 రోజులపాటు సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 25న మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు 25వ‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దిల్ రాజుతో పాటు అశ్వినీ దత్, pvp ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర రేంజ్ 70 కోట్ల‌కు పైగానే ఉంది. 

ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే ఈ చిత్ర హక్కుల కోసం 20 కోట్లు కావాలంటూ దిల్ రాజు అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అంత ఆసక్తికరంగా కనిపించడం లేదు. 20 కోట్లకు సినిమా కొనుక్కుంటే అది సేఫ్ కావడానికి 6 మిలియన్ రావాలి. అంత వస్తుందా అనేది అనుమానమే. సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా అక్క‌డ బోల్తా కొడుతున్న స‌మ‌యంలో 6 మిలియ‌న్ దాటడం అంటే చిన్న విష‌యం కాదు. మరో వైపు మహేష్ బాబు సినిమా పోస్ట్ పోన్ కావడంతో మిగిలిన హీరోలు పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 5న నాగచైతన్య మజిలీ.. ఏప్రిల్ 12న సాయిధరంతేజ్ చిత్రలహరి.. ఏప్రిల్ 19న నాని జెర్సీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

More Related Stories