English   

మాధవన్ భలే మారిపోయాడే !

Madhavan
2019-01-23 15:55:01

సౌత్ లో ఉన్న అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో సీనియర్ హీరో మాధవన్ ఒకరు. సఖిలో లవర్ బాయ్ గా ముద్దు చేసినా యువలో కరుడు గట్టిన రౌడీగా చెలరేగినా అది మాధవన్ కే చెల్లు. ఇటీవలే నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచిలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాధవన్ కి నటనా పరంగా మంచి మార్కులు తెచ్చినా ఆ సినిమా బాక్సాఫీజు దగ్గర బోల్తా కొట్టడంతో ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు తాజాగా మాధవన్ దర్శకత్వం వహిస్తూ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని తన లుక్‌ను తాజాగా మాధవన్ విడుదల చేశారు. ఈ సినిమా సెట్స్‌లో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌తో దిగిన ఫొటోలను మాధవన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో మాధవన్‌ను చూస్తుంటే అచ్చం నంబి నారాయణన్‌లానే అనిపిస్తున్నారు. నిజానికి అందులో నిజమైన నంబి ఎవరో గుర్తు పట్టడం కష్టమే. ఈ లుక్ చూస్తుంటే నంబి నారాయణన్‌ లా కనిపించడానికి మాధవన్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. సినిమా కోసం, పాత్ర కోసం మాధవన్ నిబద్ధత చూస్తుంటే ఎవరైనా హ్యాట్సాఫ్ అనక మానరు. సినిమా మొదలుపెట్టిన అనంత్ మహదేవన్ మధ్యలోనే తప్పుకోవడంతో మాధవన్ ఇప్పుడు కెప్టెన్ చైర్ లో కూర్చున్నాడు. దీంతో ఆయన రెండు బాద్యతలు నిర్వర్తిస్తున్నాడు.  

More Related Stories