English   

మిస్ట‌ర్ మ‌జ్నుతో మాస్ట‌ర్ ప్లాన్ వేసిన అఖిల్.. 

Akhil
2019-01-23 16:23:14

హిట్టు కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు ఈయన నటించిన మిస్టర్ మజ్ను సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నిడివి చూస్తుంటే అఖిల్ ప్లానింగ్ ఏంటో అర్థం అయిపోతుంది. ఈ మధ్య పెద్ద సినిమాలు ఏమీ పెద్దగా ఆడటం లేదు. రంగ‌స్థ‌లం, అర్జున్ రెడ్డి, భ‌ర‌త్ అనే నేను సినిమాల త‌ర్వాత మూడు గంట‌ల నిడివితో వ‌చ్చిన సినిమాల‌న్నీ పోయాయి. అందుకే రెండున్నర గంటలు దాటింది అంటే ప్రేక్షకులకు బోర్ వస్తుందని దర్శక నిర్మాతలకు కూడా అర్థమైపోతుంది. అందుకే ఇప్పుడు తన సినిమా విషయంలో అలాంటిదేమీ లేకుండా జాగ్రత్తపడ్డాడు అఖిల్. ఈయన మిస్టర్ మజ్ను నిడివి కేవలం 145 నిమిషాలు మాత్రమే.
 
అంటే రెండున్నర గంటల కంటే తక్కువే అన్న‌మాట‌. వెంకీ అట్లూరి ఈ సినిమాను పూర్తిస్థాయి వినోదాత్మక ప్రేమ కథగా తెరకెక్కించాడు. తొలిప్రేమ ఎలా అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంది కచ్చితంగా ఈ చిత్రం కూడా అలాగే ఆకట్టుకుంటుందని ధీమాగా చెబుతున్నారు వెంకీ అట్లూరి. జనవరి 25న అక్కినేని అభిమానులు మిస్టర్ మజ్ను సినిమా పండగ చేసుకోవడం ఖాయం అంటూ మాట ఇస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమా విడుదల కాకముందే వెంకీ అట్లూరికి మరో అవకాశం ఇచ్చాడు అఖిల్. దీన్నిబట్టి ఈ ఇద్దరి మధ్య ఎంతటి కెమిస్ట్రీ కుదిరిందో అర్థమైపోతుంది. మొత్తానికి అఖిల్ కోరుకుంటున్న విజయాన్ని వెంకి ఇస్తాడో లేదో మ‌రో వారం రోజుల్లో తేలిపోనుంది. 

More Related Stories