English   

వర్మ సినిమా మీద కేస్ వేసిన వర్మ !

lakshmis-NTR
2019-01-23 10:31:42

వివాదాలకు కేరాఫ్ గా మరి ఆ వివాదాలనే ఇంటి పేరుగా మార్చుకుంటున్న రాంగోపాల్ వర్మ తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. తన సినిమాలకి ప్రమోషన్ చేసుకోవడంలో ప్రొఫెషనల్ పీఆర్వోలను ఎప్పుడో దాటేసినా వర్మ ఈ సినిమా గురించి ప్రతి రోజూ జనాలు చర్చించుకునేలా రెండ్రోజులకి ఒక పిక్ వదులుతూ వస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి వెన్నుపోటు సాంగ్ విడుదల చేసి సంచలననానికి తెరలేపారు. దీంతో ఒకరకంగా ఈ సినిమా మీద ఏపీలో అలజడులు రేగాయి. ఏపీలో పలుచోట్ల టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం ఎన్టీఆర్ లను కించపరిచేలా సినిమాను తెరకెక్కిస్తున్నారని, దీని వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందని ఈ నిర్మాతే ఒక వైసీపీ నేత అని ఆరోపించారు. అది ఆరోపణలకే పరిమితం అవ్వగా తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పిల్ దాఖలు చేశారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ. ఈ పిల్‌ను విచారించిన కోర్టు చిత్ర దర్శక-నిర్మాతలకూ, సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసిందని, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిందని ఎమ్మెల్యే వర్మ తెలిపారు.   మరి ఈ పిటిషన్ పై లక్ష్మీస్ ఎన్టీఆర్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజానికి వర్మ ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు గానే ఫోటోలు గానీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు సో బేసిక్ గా వ‌ర్మ‌కి వ‌చ్చిన స‌మ‌స్య ఏమీలేదు. కాకపోతే స్వయంగా ఆయా వ్యక్తులు పరువు నష్టం దావా వేస్తే ఏమైనా ఇబ్బంది పడచ్చు. అయితే తనపై ఎవరైనా కామెంట్ చేసినా నిమిషాల్లో స్పందించే ఆర్జీవీ ఇప్పటి దాకా ఈ వ్యవహారం మీద స్పందించలేదు. ఇదేం ఆర్జీవీకి కొత్త కాదు గతంలో కూడా ఆర్జీవీపై ఇలా చాలానే కేసులు పిల్‌‌లు వేసిన సందర్భాలున్నాయి.  ఈ ఎమ్మెల్యే వర్మ ఎవరంటే తూర్పు గోదావరి జిల్లా టీడీపీ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ.

More Related Stories