ఆ హీరో భార్యతో ధనుష్ రొమాన్స్ !

ఇటీవలే 'మారి 2' తో సందడి చేసిన ధనుష్, ప్రస్తుతం తన తర్వాత్ 'అసురన్' సినిమా పనులతో బిజీగా వున్నాడు. వెట్రి మారన్ దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 26వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ధనుష్ - వెట్రిమారన్ ల కాంబినేషన్ లో 'పొల్లాదవన్' - 'ఆడుగళం' - 'వడ చెన్నై' చిత్రాలు వచ్చి హిట్ కాంబినేషన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే రాబోయే సినిమాలో ధనుష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. మద్య వయస్కుడి పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లుగా ఆ యూనిట్ ద్వారా సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. మలయాళ వివాదాస్పద నటుడు దిలీప్ మాజీ భార్య అయిన మంజు వారియర్ కి అప్పట్లో హీరోయిన్ గా చేసి ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది. ఈమద్య రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టు గా బానే ఆఫర్లు సంపాదిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ పాత్ర వయసుని బట్టి ఆమె కరెక్ట్ అనుకుని ఆమెని ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల మీద ధనుష్ ఫ్యాన్స్ మండిపడుతూన్నారు. అయితే ఈ వార్తను ఇంకా యూనిట్ ఖరారు చేయకపోవడం గమనార్హం