English   

షూటింగ్ లో గాయపడ్డ హన్సిక !

actress hansika injured in maha movie shooting
2019-01-23 16:05:37

బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వార్తల్లోకి వచ్చిన హన్సిక షూటింగ్‌లో గాయపడిందని తెలుస్తోంది. హన్సిక లీడ్ రోల్ లో నటిస్తున్న ఆమె 50 చిత్రం ‘మహా’ షూట్ లో భాగంగా ఒక యాక్షన్ సీన్ తీస్తుండగా ఆమె అదుపు తప్పు కింద పడిపోవడంతో చేతికి గాయం అయ్యింది. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో చాలా కీలకం కావడంతో షూటింగ్‌ కి పేకప్ చెప్పనివ్వకుండా ఆ గాయంతోనే షూటింగ్‌ని కంప్లీట్ చేసిందట హన్సిక. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు జమీల్ దర్శకత్వం వహిస్తుండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఇటీవలే స్వామీజీ వేషధారణలో హన్సిక పొగ తాగుతున్నట్లుగా ఈ లుక్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రావటంతో పాటు వివాదం కూడా చుట్టుముట్టింది. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ పోస్టర్ ఉందని ఆరోపిస్తూ జానకి రామన్ అనే వ్యక్తి కేసు వేశాడు. దర్శకుడి పేరు ముస్లిం లాగా ఉంది కాబట్టి అతను హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీయడానికే ఇలాంటి పోస్టర్ వదిలారని వారి మీద కేసు వేశారు.

More Related Stories