English   

తీవ్ర విషాదంలో డియర్ కామ్రేడ్ డైరెక్టర్ !

dear comrade movie director kamma bharat father passes away
2019-01-23 16:20:48

అంటే తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగడం సాధారణమే. అయితే, ఆ కుమారుడిని చూసి పదిమంది ప్రజలూ మెచ్చుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగినట్టు అని అప్పట్లో ఒక కవి అన్నారు. కానీ మన టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ తండ్రికి ఆ అవకాశం కొద్దిలో తప్పిపోయింది. వివరాల్లోకి దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్న భరత్ కమ్మ తండ్రి కన్ను మూశారు. మొదటి సినిమానే నేటి యూత్ క్రేజీ స్టార్ అయిన విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి సినిమా చేస్తున్నారు. తన తొలి సినిమాను సొంతఊరిలో మొదటి ఆటకు తీసుకెళ్ళి  తల్లిదండ్రులకు చూపించాలని ఆ దర్శకుడు కూడా ఆశపడి ఉంటారు. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలచినది. తన కుమారుడి తొలి సినిమాను ఆ తండ్రికి ఇంకెప్పటికీ చూపించకుండా చేసింది. వైవిధ్యమైన సినిమాలు మాత్రమే తీసే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన భరత్ డియర్ కామ్రేడ్ తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా భరత్ తండ్రి రమణారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమణారావు చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన తన మొదటి సినిమాకి కొద్ది రోజుల ముందర చనిపోవడంతో భరత్ బాధ వర్ణనాతీతం.

More Related Stories