English   

ప్రభాస్ కు నర్సాపురం టికెట్.. ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు.. బీజేపీ బంపర్ ఆఫర్..

Prabhas
2019-01-24 03:27:34

దేశంలో ఉన్న ప్రముఖులు అందరిపై కన్నేసింది భారతీయ జనతా పార్టీ. 2019 ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరెవరు పనికి వస్తారా అని వాళ్లకు వలేస్తున్నారు కమలనాధులు. ఈ లిస్టులోనే ప్రభాస్ కూడా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం నియోజకవర్గం నుంచి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆశ చూపిస్తున్నారు బిజెపి నేతలు. కృష్ణంరాజు 1992, 1999 ఎన్నికల్లో పోటీ చేసిన నరసాపురం నుంచి ఇప్పుడు ప్రభాస్ ను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు బిజెపి నేతలు. అయితే దీనికి ప్రభాస్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది.. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ప్రభాస్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. కృష్ణంరాజు బిజెపిలో ఉన్నా కూడా ఈయన మాత్రం పాలిటిక్స్ లో దూరం దూరంగానే ఉన్నాడు. 

ఇప్పుడు ఉన్నట్లుండి ప్రభాస్ బిజెపి లో చేరుతున్నారు అని వచ్చిన వార్తలు చూసి అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. డార్లింగ్ వెళ్లి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాడా అనే కంగారు వాళ్ళలో కనిపిస్తుంది. అయితే ప్రభాస్ సన్నిహితులు మాత్రం ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ బయట పెట్టిన పుకార్లు మాత్రమే ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు వాళ్ళు. మరోవైపు ప్రభాస్ ను ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకొస్తే కృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సీటు ఇస్తామని బిజెపి ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికి ఇప్పుడు ప్రభాస్ రాజకీయ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలుగులోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా అజిత్ కు వల వేయాలని ప్రయత్నించి వల్ల కాక అడ్డంగా బుక్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తెలుగులో ప్రభాస్ కోసం చూస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్లకు షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories