English   

ప్రియా వారియర్ టాటూ సీక్రెట్ !

Priya Prakash Varrier Tattoo secreate
2019-01-24 16:01:02

ప్రియా ప్రకాష్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ? ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది మలయాళ ముద్దుగుమ్మ. ఒరు ఆదార్ లవ్ అనే మలయాళ చిత్రానికి సింగిల్ కన్నుతో తిరుగులోనే క్రేజ్‌ని తీసుకువచ్చింది ప్రియా. గత ఏడాది ఎక్కువగా గూగుల్ త్రెండింగ్ లో ఉందీ పిల్ల. అందుకే ఈ సినిమాని లవర్స్ డే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తుండగా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌ గా ప్రియా నిలిచింది. అయితే ప్రియా అందాలతో పాటు ఆమె చాతిపై భాగంలో ఉన్న పచ్చబొట్టుపై మీడియా కెమెరాలు అన్నీ ఫోకస్ అయ్యాయి. దీంతో ప్రియా వారియర్ టాట్టూ ఏమిటి ? దానికిన్ అర్ధం ఏమిటి అనేదాని మీద చర్చలు మొదలయ్యారు. ఆమె ఎదపై ఉన్న ‘Carper Diem’ పదాలకు అర్ధం వెతికే పనిలో పడ్డారు. అదేంటో పరిశీలిస్తే ఇదో లాటిన్ పదం దానికి అర్ధం ప్రస్తుతంలో జీవించండి.. కలలో తేలిపోకండి అని. నిజమే మరి ఆ మళయాళ సినిమాలో కనిపించే వరకు అసలు ఎవరికీ తెలియని ప్రియా ప్రకాష్ ఇప్పుడు దేశం మొత్తానికి కలల సుందరిగా మారిపోయింది.

More Related Stories