English   

మళ్ళీ పెళ్ళికి సిద్దమయిన రజనీ కూతురు !

Rajinikanth's daughter Soundarya Rajinikanth to marry Vishagan Vanangamudi on February 11
2019-01-24 16:50:51

రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం 2010వ సంవత్సరంలో అశ్విన్ అనే వ్యాపార వేత్తతో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ వేద్ అనే ఒక కుమారుడు కలిగాక ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో ఇక లాభం లేదనుకున్న ఇద్దరూ 2017వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి విషగన్ వనగమూడి అనే నటుడు కం వ్యాపారవేత్తతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సౌందర్యకి నిశ్చితార్థం జరిగింది. ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. మెహెందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలను కలుపుకుని, ఇది మూడు రోజుల పాటు వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే రజనీ ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ఒక అల్లుడు ధనుష్ తమిళ సినిమాలో స్టార్ హీరోల్లో ఒకరిగా చెలామణీ అవుతుంటే రెండో అల్లుడు కూడా నటుడే కావడం గమనార్హం. ఇక సౌందర్య విషయానికి వస్తే తన తండ్రి హీరోగా కొచ్చాడయాన్, బావ  ధనుష్ హీరోగా వీఐపీ 2 దర్శకురాలిగా వ్యవహరించారు. అయితే ఆమె గ్రాఫిక్ డిజైనర్ గా కొన్ని సినిమాలకి పని చేశారు.  

More Related Stories