English   

రామ్ చరణ్ విన్నపంతో మనసు మార్చుకున్న నయనతార..

Nayantara accepts Ram Charan request
2019-01-24 10:45:30

రామ్ చరణ్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. అందుకే ఈయన తన బాధ్యతలను గుర్తు చేసుకుని సైరా సినిమా కోసం ఇప్పటి నుంచే కష్టపడుతున్నాడు. ఈ సినిమాను తన భుజస్కంధాలపై మోస్తున్నాడు మెగా వారసుడు. దాదాపు 200 కోట్లతో సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీని కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ సైరా కోసం వర్క్ చేస్తున్నారు. ఆధ్వర్యంలోనే యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు సురేందర్ రెడ్డి. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు రామ్ చరణ్. బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధమే అంటున్నాడు మెగా వారసుడు. దానికి తోడు చిరంజీవి కూడా ఉన్నాడు కాబట్టి డబ్బులు వెనక్కి వస్తాయా రావా అని కంగారు కూడా అవసరం లేదు.
సినిమా బాగుంటే ఎన్ని కోట్లైనా వెనక్కి వస్తాయని నమ్మకాన్ని బాహుబలి ఇచ్చింది.. ఇక ఈ సినిమా కోసం ఇప్పుడు నయనతార కూడా ఒక వరం ఇవ్వబోతోంది. సినిమాలు ఒప్పుకోవడం.. పూర్తి చేయడం తప్ప ప్రమోషన్ కు రావడం అలవాటు లేని నయనతారను ప్రమోషన్ కోసం ఒప్పించాడు రామ్ చరణ్. రజనీకాంత్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలకు కూడా నయనతార ప్రమోషన్ చేయలేదు. అయితే ఇప్పుడు ఏం చెప్పాడో ఏమని అడిగాడో తెలియదు కానీ రాంచరణ్ కు మాత్రం నయనతార సైరా ప్రమోషన్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది నిజం అయితే మెగా అభిమానులు పండగ చేసుకోవచ్చు. చిరంజీవి, నయనతార కలిసి సినిమాను ప్రమోట్ చేస్తే అది ఇతర భాషల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా తమిళనాట సైరా సినిమా నయనతార ఇమేజ్ బాగా ప్లస్ కానుంది. దసరాకు సైరా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories