English   

ఆ సీక్వెల్ కోసం యూరప్ కి నాగ్ !

Rahul Ravindran direct Nagarjuna's Manmadhudu sequel?
2019-01-24 12:53:26

ప్రస్తుతం తెలుగు, హిందీ సహా అన్ని బాషల సినీ పరిశ్రమలలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. చాలా మంది హీరోలు కొత్త కథలతో రిస్క్ చేయడం ఎందుకనో ఏమో వాళ్ల పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య తాత మనవళ్లుగా నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాగార్జున మరో సీక్వెల్‌కు ఓకే చెప్పాడు. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో మన్మథుడు ఒకటి. కథ - మాటలు త్రివిక్రమ్ అందించిన ఈ సినిమాకి అప్పట్లో విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2002 ఏడాదిలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత చాలాకాలం పాటు నాగార్జున టాలీవుడ్ మన్మథుడుగానే పాపులర్ అయ్యాడు. అలాంటి సినిమాకి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది. యువ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన అధిక భాగం చిత్రీకరణ యూరప్ లో జరగనున్న నేపధ్యంలో అందువలన 2 నెలలపాటు నాగార్జున యూరప్ లోనే ఉండనున్నారు. ఫిబ్రవరి 3వ వారంలో ఈ సినిమాను లాంచ్ ఉంటుందని మార్చి 2వ వారంలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు.  నిజానికి మన్మధుడు అంటే ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, ఆ సినిమాలోని సంభాషణలు ఇప్పటికీ మనం వాడుతూ ఉంటాం మరి త్రివిక్రమ్ బ్రాండ్ సినిమాకి సీక్వెల్ అంటే రాహుల్ చాలా కష్టపడాలి. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories