English   

మురుగుదాస్ కోసం పోలీస్ అవుతున్నా రజనీకాంత్..

Rajinikanth plays a cop in AR Murugadoss film
2019-01-24 20:17:55

1 2 3 అంటూ లెక్కపెట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు రజినీకాంత్. ఒకప్పుడు ఈయన నుంచి సినిమా రావాలి అంటే మూడేళ్ల పాటు వేచి చూసే వాళ్ళు అభిమానులు. కానీ ఇప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు సూపర్ స్టార్. ఈయన జోరు చూసి అసలేంటి స్పీడ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది పేట సినిమాతో వచ్చాడు సూపర్ స్టార్. దీనికి సరిగ్గా మూడు నెలల ముందు శంకర్ 2.0 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. దానికి మూడు నెలల ముందు కాలా సినిమా తో వచ్చాడు. ఇక ఇప్పుడు పేట విడుదలై 15 రోజులు కూడా గడవకముందే మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు రజినీకాంత్.
ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఖాకీ డ్రెస్ వేయబోతున్నాడు ఈ హీరో. ఇందులో రజనీకాంత్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడిగా మారిన దగ్గరనుంచి ఎప్పుడెప్పుడు రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం వస్తుందా అని వేచి చూస్తున్న మురుగుదాస్ కు ఇన్నాళ్ళకు అవకాశం ఇచ్చాడు సూపర్ స్టార్. దాంతో తన కసి మొత్తం తీర్చుకోవాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. కొన్నేళ్లుగా రజనీకాంత్ కు అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని ఈ సినిమాతో ఇస్తా అంటున్నాడు మురుగుదాస్. మరి పోలీసు డ్రెస్ లో రజినీకాంత్ ఎంత రచ్చ చేయబోతున్నాడు దసరాకు తేలనుంది.

More Related Stories