English   

హాస్పిటల్ లో జాయిన్ అయిన వెంకటేష్ !

Daggubati venkatesh hospitalized in vizag
2019-01-24 13:34:44

సంక్రాంతికి F2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ హాస్పటల్‌లో చేరారని వార్తలు వస్తున్నాయి. తీవ్ర వెన్నునొప్పి కారణంతో విశాఖపట్నంలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్న వెంకీ F2 చిత్రంతో బిజీగా ఉన్నాడు, తాజాగా అన్ని ప్రమోషన్ లు పూర్తవ్వగా ఆయన మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారు. అక్కడే మరికొన్ని రోజులు ట్రీట్ మెంట్ తీసుకుని తిరిగి హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది. చికిత్స పూర్తయిన తరువాత విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. ఈ సినిమా మార్చ్ నుంచి షూటింగ్ కి వెళ్ళే ప్లాన్ లో ఉంది సినిమా యూనిట్. సంక్రాంతి కానుకగా విడుదలైన F2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకోవడమే కాకా రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరువైంది.  చాన్నాళ్ళగా నిద్రపోతున్న వెంకీ లోని కామెడీ యాంగిల్ ను మరోసారి బయటకు తీసింది ఈ సినిమా. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లు గా నటించారు. ఇక అనిల్ డైరెక్షన్లోనే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద అనిల్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చినా పూర్తి వివరాలు అయితే ఖరారు చేయలేదు.

More Related Stories