English   

బాలిక మీద లైంగిక వేదింపులు...చిక్కుల్లో సీనియర్ నటి !

Child abuse case against actress Bhanupriya
2019-01-24 14:28:16

ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ మీద వేధింపుల కేసు నమోదయింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు నమోదైంది. సామర్లకోటకి చెందిన ప్రభావతి అనే మహిళ ఈ కేసు పెట్టింది. ఏడాది క్రితం సంధ్య అనే తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో పనికి పంపించామని ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలని పనిమనిషిగా పంపిన తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంగా తన కుమార్తెను ఇంటికి పంపడం లేదని, ఫోన్ లో మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. భానుప్రియ అన్న తన కుమార్తె మీద లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఆరోపించింది. గట్టిగా మాట్లాడితే తన కూతురుపై చోరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపింది. అయితే వాస్తవానికి అసలు మైనర్ లను పనిలో పెట్టుకోవడం నేరం, అందునా లైంగిక వేధింపులు అంటే భాను ప్రియ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పటికే భానుప్రియ, అతని సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సొసైటీలో నలుగురికి మంచి చెప్పాల్సిన వీరే ఇలాంటి పనులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More Related Stories