English   

ఆర్ఆర్ఆర్ లో ఆ టాప్ డైరెక్టర్ !

Samuthirakani opens up on his Tollywood debut with SS Rajamouli film RRR
2019-01-24 21:44:33

బాహుబలి క్రియేటర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కథానాయకులుగా ఒక భారీ మల్టీస్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోలు ఇద్దరు గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇతర నటీనటులకు సంబంధించిన ఒక్క సమాచారం కూడా ఇంతవరకూ బయటికి రాలేదు. అయితే ఈ మధ్య ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖనిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. సినిమాలో కధను మలుపు తిప్పే చాలా  ముఖ్యమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఇంతకీ ఆ పాత్ర ఏమిటనే విషయం అయితే తెలియలేదు. సముద్రఖనికి అభిరుచి కలిగిన దర్శకుడిగా, ఎటువంటి పాత్రనయినా అవలీలగా చేసే నటుడిగా తమిళనాట ఆయనకు పేరు వుంది. అందుకే ఆయన్ను రాజమౌళి ప్రిఫర్ చేసారని అంటున్నారు. అలాగే ఈ సినిమాని వీలయినన్ని ఎక్కువ బాషలలో విడుదల చేయాలని భావిస్తున్న రాజమౌళి ఎక్కువమంది వేరే బాషల నటులను కూడా వాడుకోవాలని చూస్తున్నారని సమాచారం.

More Related Stories