English   

గోపీ కోసం సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ !

gopichand act with Zarine Khan
2019-01-24 15:02:09

బాలీవుడ్ ఒకప్పటి హాట్ బ్యూటీ కత్రినా పోలికలతో ఉండడం ఆమెకు వరం. ఆ పోలికలతో ఉండబట్టే సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన వీర్‌ సినిమాతో ఆమెని వెండితెరకు పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు జరీన్‌ ఖాన్‌, స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చినా సక్సెస్‌ రేట్ లో మాత్రం వెనకపడిపోయింది. నిజానికి ఎప్పటికప్పుడు గర్ల్ ఫ్రెండ్స్‌ని మార్చడం సల్మాన్ ఖాన్‌కి అలవాటు. ఐతే ఏ గర్ల్ ఫ్రెండ్‌తో కూడా అతడి జోడీ ఎక్కువ కాలం సాగలేదు. ఐతే మిగతా వాళ్లతో విడిపోయినపుడు ఎలా ఫీలయ్యాడో కానీ.. కత్రినా కైఫ్‌తో కటీఫ్ అయినపుడు మాత్రం తెగ ఇబ్బంది పడిపోయాడు. అచ్చంగా కత్రినా పోలికలతో ఉండే జరీన్ ఖాన్‌ను పట్టుకొచ్చి ‘వీర్’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఏం లాభం జరీన్ రాణించలేదు. సల్మాన్‌ కూడా ఆమెని పక్కనబెట్టేశాడు. అప్పట్నుంచి బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతోంది ఈ మినీ కత్రినా. ఆఖరికి హేట్ స్టోరి 3 లాంటి సినిమాలో గ్లామరస్ రోల్‌లో కనిపించినా అది కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో సక్సెస్‌ కోసం సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది ఈ బ్యూటి. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న బై లింగ్యుయల్ మూవీలో జరీన్‌ ఖాన్‌ హీరోయిన్‌గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రాశీఖన్నాను ఒక హీరోయిన్‌గా ఫైనల్‌ గా చేయగా మరో హీరోయిన్‌ పాత్రకు జరీన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమా షూట్ తాజాగా జైసల్మేర్ లో మొదలయ్యింది. అన్ని కుదిరితే బాలీవుడ్ ముద్దుగుమ్మతో గోపీచంద్ రొమాన్స్ చేయబోతున్నాడన్న మాట.

More Related Stories