English   

అన్న‌య్య‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన వ‌రుణ్ తేజ్..

varun tej gives shock to ram charan
2019-01-24 22:34:54

సంక్రాంతి సినిమాల్లో మరో ఆలోచన లేకుండా విజేతగా నిలిచింది ఎఫ్ 2. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో రామ్ చరణ్ ను పూర్తిగా ఓడించాడు వరుణ్ తేజ్. సంక్రాంతి వార్ మొదలు కాక ముందు మెగా అన్నదమ్ముల మధ్య ఆసక్తికరమైన పోరు నడిచింది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారా అని అభిమానులు కూడా ఆసక్తిగా చూశారు. ముందు నుంచి రామ్ చరణ్ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన ఎఫ్2 సంచలన విజయం సాధించి చరణ్ సినిమాను పూర్తిగా తొక్కేసింది. దానికి తోడు వినయ విధేయ రామ‌ సినిమాకు తొలి రోజు డిజాస్టర్ టాక్ రావడంతో పైకి లేవలేకపోయింది. ఇక వరుణ్ తేజ్ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పండక్కి వచ్చిన మిగిలిన మూడు సినిమాలు కూడా చేతులెత్తేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పండ‌గ చేసుకుంది. 12 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది ఎఫ్2. పండక్కి అన్నాద‌మ్ముల్లో ఎవరు గెలుస్తారో అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వచ్చేసింది. అన్నయ్యను తన సినిమాతో పూర్తిగా డామినేట్ చేసి విజేతగా నిలిచాడు తమ్ముడు. గత ఏడాది కూడా సాయి ధరంతేజ్ ఇంటలిజెంట్ సినిమాపై తన తొలి ప్రేమ సినిమాను విడుదల చేసి విజయం సాధించాడు వ‌రుణ్ తేజ్. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఓడించాడు.

More Related Stories