English   

మిస్టర్ మజ్ను సినిమా ప్రీమియర్ టాక్..

Mr Majnu movie talk
2019-01-25 01:18:07

అఖిల్ మూడో సినిమాతో హిట్టు కొట్టాడా లేదా.. ఇప్పుడు అక్కినేని అభిమానులు ఇదే ఆలోచిస్తున్నారు. ఈయన నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి థియేటర్లలో విడుదలైంది మిస్టర్ మజ్ను. ఓవర్సీస్ నుంచి ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం కూడా విజయం అందించడం కష్టమే అంటున్నారు. సాదా సీదా కథతోనే మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఫస్టాఫ్ అంతా బాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్ గా వెంకీ అట్లూరి తెరకెక్కించాడు అంటున్నారు ప్రేక్షకులు. తొలి ప్రేమ విషయంలో వర్కవుట్ అయినా ఎమోషనల్ సీన్స్ ఇందులో అంతగా వర్కవుట్ కాలేదు అంటున్నారు. అఖిల్ తన వరకు బాగానే చేసినా కూడా సినిమాలో విషయం కాస్త తక్కువగా ఉండటంతో నిరాశ తప్పదు అంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుండటంతో ఈ సినిమా వర్కవుట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ మజ్ను ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టాక్ బాగా తెచ్చుకుంటే సినిమాలు లేవు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పంట పండించుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా తేడా జరిగితే ఇప్పటికే f2 బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమా కుమ్మేస్తుంది. దానికి మరో వారం అవకాశం ఇచ్చినట్లవుతుంది. మరి చూడాలి మిస్టర్ మజ్ను తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..

More Related Stories