English   

భానుప్రియ వేధింపులు...అసలు సంగతి ఇదీ !

Bhanu-Priya
2019-01-25 09:28:01

మైనారిటీ తీరని తన కూతురిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ సీనియర్ నటి భానుమతి మీద సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ప్రభావతి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ నిన్న మీడియాలో హల్చల్ చేయగా, తనపై వచ్చిన ఆరోపణలను సినీ నటి భానుప్రియ స్పందించారు. ఆరోపణలను ఖండించిన ఆమె బాలిక తల్లి ప్రభావతి కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సదరు బాలిక ఏడాది నుంచి తమ వద్దే పనిచేస్తోందని ఆమెకు ఇప్పుడు పదహారు పదిహేడేళ్ళు ఉంటాయని ఇంట్లో ఉన్న డబ్బు, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో నిఘా పెట్టామని అందులో ఆ బాలికే అవన్నీ దొంగిలిస్తుందని తేలిందని ఆమెని నిలదీస్తే దీంతో ఆమె అసలు విషయం చెప్పి ఇంట్లో దొంగిలించిన నగదు, వస్తువులను తన తల్లికి ఇచ్చిన విషయం తెలిపిందని అన్నారు. పోలీసులకు చెబుతామని హెచ్చరించే సరికి ఆమె తన తల్లి చేత కొన్ని వస్తువులు తెప్పించిందని భానుప్రియ తెలిపారు. ఐప్యాడ్‌, వాచ్‌, కెమెరా వంటి వస్తువులు చెన్నై తెచ్చిన ఆమె తల్లి ఇంకేమీ లేవని ముందు బుకాయించిదని కానే ఆమె కూతురు క్లారిటీ ఇవ్వడంతో మిగిలిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లిందని భానుప్రయ తెలిపారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి తమ మీద తప్పుడు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అలాగే సంధ్య అనే బాధిత బాలిక మాట్లాడుతూ భానుప్రియ ఇంట్లో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని డబ్బు, నగలు దొంగిలించి తానే తన తల్లికి ఇచ్చానని తెలిపింది. వాటిని తిరిగి తీసుకొస్తానని చెప్పి వెళ్లిన తన తల్లి భానుప్రియపై కేసు పెట్టిందని చెప్పింది. తనకు ఎలాంటి వేధింపులూ లేవని మీడియాకు వెల్లడించింది.

More Related Stories