English   

మణికర్ణికని ఆపలేం !

Manikarnika
2019-01-25 11:09:05

కంగ‌నా ర‌నౌత్‌ నేడు మ‌ణిక‌ర్ణిక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ సినిమాని క్రిష్‌ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా తెర‌కెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఝాన్సీ ల‌క్ష్మీబాయిని త‌ప్పుగా చూపించారంటూ హిందూ క‌ర్ణిసేన వాళ్ళు ఆందోళ‌న‌కి దిగారు. సినిమా విడుద‌ల‌ని ఆపాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో ల‌క్ష్మీ భాయ్‌ని అగౌర‌వ‌ప‌రిచేలా ఏ ఒక్క సీన్ ఉన్నా కూడా కంగ‌నా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తూ కర్ణిసేన బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ సినిమా విడుదల ఆపలేమని చెబుతూ విడుదలకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే కర్ణిసేన కార్యకర్తలు చేసిన ఆరోపణలపై హైకోర్టు వివరణ కోరింది. ఆరోపణలపై మణికర్ణిక చిత్రయూనిట్ రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే సినిమాలో ల‌క్ష్మీభాయ్ గురించి త‌ప్పుగా చూపించ‌లేదని ఆమె భర‌త‌ మాత ముద్ధుబిడ్డ‌ని, ఆమె గురించి త‌ప్పుగా ఎలా చూపిస్తామ‌ని కంగనా అంటోంది. క‌ర్ణిసేన బెదిరింపుల‌తో కంగ‌నా ఇంటి ద‌గ్గ‌ర భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు పోలీసులు. దీంతో సినిమాలి చిక్కులు తోలిగిపోగా ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 50 దేశాల‌లో విడుద‌ల కానుంది ఈ సినిమా.

More Related Stories