English   

బర్త్ డే గిఫ్ట్ రెడీ చేసిన రవితేజ !

Ravi-Teja
2019-01-25 12:11:52

బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ బ్యాక్ టు బ్యాక్ రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాలు చేశాడు. ఇందులో రాజా ది గ్రేట్ మినహా మరే సినిమా హిట్ కొట్టలేదు. ఇక ఆయన ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి విలక్షణ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని నేలటికేట్ నిర్మించిన రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నుండగా ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు కన్నడ భామ నభా నటేశ్‌ కాగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మరో హీరోయిన్. మూడో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. సునీల్‌ కూడా ఈ సినిమాలో మంచి పాత్రలో నటించనున్నాడట. అలాగే త‌మిళ స్టార్ బాబీ సింహాని విలన్ గా అనుకుంటున్నారని తెలుస్తుంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను లాంచ్ చేయనున్నారట. అయితే చాన్నాళ్ళగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ ఈ సినిమాతో అయినా హిట్ కోడతాదేమో చూడాలి మరి.

More Related Stories