English   

'మిస్టర్ మజ్ను'  రివ్యూ

Mr-Majnu
2019-01-25 06:09:10

హలో సినిమా తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకొని అఖిల్ చేసిన సినిమా మిస్టర్ మజ్ను. ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని వారసుడు. మరి ఈయన ఆశలు ఎంతవరకు నెరవేరాయో చూద్దాం.

కథ:

అఖిల్ లండన్ లో చదువుతుంటాడు. కనిపించిన ప్రతి అమ్మాయి ఆయనకు పడిపోతుంది. అఖిల్ కూడా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు, ప్రేమంటే పెద్దగా తెలియదు, అలాంటి ఆయన జీవితంలోకి నిధి అగర్వాల్ వస్తుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపిస్తుంది. కానీ అది అర్థం కాదు, అర్థమయ్యే సమయానికి ఆమె వదిలి వెళ్ళిపోతుంది. తనను వద్దనుకొని వెళ్లిపోయిన ప్రియురాలి ప్రేమ కోసం ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అఖిల్. అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు ఎందుకు నిజమైన ప్రేమను అఖిల్ అర్థం చేసుకోలేదు అనేది అసలు కథ.

కథనం:

తొలిప్రేమ లాంటి సినిమా తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా కావడంతో మిస్టర్ మజ్ను ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అఖిల్ కూడా పూర్తి స్థాయి ప్రేమ కథ చేయడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. వాళ్ళ అంచనాలు నిలబెట్టేలా ఫస్టాఫ్ నడిపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. మంచి ఎమోషనల్ సీన్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు, ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అద్భుతంగా లేకపోయినా కూడా అలరించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు వెంకీ అట్లూరి. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అఖిల్ కోరుకున్న విజయం వచ్చిందేమో అనిపించింది. చాలా సీన్లు బాగానే వర్కవుట్ అయ్యాయి, ముఖ్యంగా అఖిల్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే సీన్స్ బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా కథ సాగింది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ లండన్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి కాస్త తడబడ్డాడు వెంకీ అట్లూరి. మూస ఫార్ములాతో ముందుకు వెళ్ళిపోయాడు, ఒక చక్రంలో పడి పోయి అక్కడే కథను తిప్పాడు దర్శకుడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ స్క్రీన్ ప్లే మిస్టర్ మజ్ను సెకండ్ హాఫ్ లో కనిపించడం కాస్త నిరాశ కలిగించే విషయం. అయితే అక్కడికి హైపర్ ఆది, ప్రియదర్శి కామెడీతో చాలావరకు కవర్ చేశాడు వెంకీ అట్లూరి. కానీ ఫస్ట్ హాఫ్లో కనిపించిన ఎమోషనల్ సీన్స్ సెకండాఫ్ లో లేకపోవడం ఎమోషనల్ కంటెంట్ తగ్గిపోవడంతో సెకండ్ హాఫ్ మనకు తెలియకుండానే ఒక నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో దిల్ రాజు మనవడుకి బొమ్మ డబ్బింగ్ చెప్పడం బాగా అనిపించింది. అది చాలా చోట్ల నవ్వులు పంచింది. ఓవరాల్ గా మిస్టర్ మజ్ను యావరేజ్ గానే కనిపిస్తుంది, సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటె కచ్చితంగా తొలి ప్రేమ కంటే పెద్ద విజయం సాధించేది. అయినా కూడా ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లుగా వారి ఆలోచన శైలి కి దగ్గరగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెంకీ అట్లూరి.

నటీనటులు:

అఖిల్ బాగా చేశాడు, ఈయన గత సినిమాలు అఖిల్ హలో సినిమాలతో పోలిస్తే ఇందులో ఇంకాస్త మెచ్యూర్డగా కనిపించాడు. అక్కినేని వారసుడు ఎమోషనల్ సీన్స్ లోనూ బాగానే నటించాడు. ఇక నిధి అగర్వాల్ పర్వాలేదు అనిపించింది. సవ్యసాచి తో పోలిస్తే ఇందులో కాస్త నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. ప్రియదర్శి, హైపర్ ఆది పూర్తిగా కామెడీ భుజాన వేసుకున్నారు. నాగబాబు, రావు రమేష్ మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు

టెక్నికల్ టీం:

తమన్ మరోసారి ఆకట్టుకున్నాడు. తొలిప్రేమ కు అద్భుతమైన సంగీతం అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన తమన్ వెంకీ అట్లూరి కోసం మరోసారి అదే మ్యాజిక్ చేశాడు. పాటల విషయంలో అంత అద్భుతం చేయకపోయినా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం నిజంగానే మ్యాజిక్ చేశాడు ఈ సంగీత దర్శకుడు. జార్జి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ఎడిటింగ్ కూడా పర్లేదు కానీ సెకండాఫ్ కొన్ని సీన్లు బోర్ కొట్టించిన ట్లు అనిపించాయి. ఇక దర్శకుడిగా వెంకీ అట్లూరి చాలా వరకు సక్సెస్ అయ్యాడు మరోసారి రోటీన్ సినిమానే తీసుకువచ్చినా కూడా దానికి ఎమోషనల్ కంటెంట్ యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కాకపోతే మరీ రొటీన్ స్క్రీన్ ప్లే మిస్టర్ మజ్ను కి కాస్త మైనస్ అయ్యింది. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగా వెంకీ అట్లూరి మాత్రం తనలో విషయం ఉంది అని మరోసారి నిరూపించుకున్నాడు.

చివరగా: మిస్టర్ మజ్ను కొంచెం ఇష్టం కొంచెం కష్టం.

రేటింగ్: 2.75/5

More Related Stories