English   

సూర్యకాంతం టీజర్ టాక్ : నిహారిక అంతకు మించి !

Suryakantam
2019-01-25 18:13:39

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక. ఫ్యామిలీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పద్దతైన సినిమాలు మాత్రమే చేయాలి అనుకుంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన ఆమె సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అయితే తాజాగా నిహారిక ఆ గీత చెరిపేసిందా అనే అనుమానం కలుగుతోంది  'సూర్యకాంతం' టీజర్ చూశాక. నిహారిక తాజాగా న‌టిస్తున్న మూవీ సూర్య‌కాంతం. ఆమె స‌ర‌స‌న స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజ‌య్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇక ముద్ద ప‌ప్పు ఆవ‌కాయ్‌ వెబ్ సిరీస్ తెరకెక్కించిన ప్ర‌ణీత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

ఈ మూవీ టీజర్ ను వరుణ్ తేజ్ ఈరోజు యూ ట్యూబ్ ద్వారా విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఆకట్టుకునే లా క‌ట్ చేశారు. ఒక వైపు చిలిపిగా, మ‌రో వైపు గయ్యాళిగా నిహారిక కనిపిస్తోంది. అలాగే టీజర్లో Fu*k life అనే ఆక్స్ సీన్ చూపడం ద్వారా ఆమె క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఆమెలో టాలెంట్ ఉంది కానీ ఇప్పటి వరకూ అది బ‌య‌ట‌ పడలేదు. అందుకే చేసిన రెండు సినిమాలూ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప‌ల్టీకొట్టాయి. ముచ్చ‌ట‌గా మూడో ప్ర‌య‌త్నం `సూర్య కాంతం`తో చేసింది. ఈ సినిమాకి ఆమె అన్న వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 29న విడుద‌ల అవుతోంది. టీజర్ అంత ఇంటరెస్టింగ్ గా సినిమా కూడా ఉంటే నిహారిక‌కు తొలి హిట్ ప‌డిన‌ట్టే.

More Related Stories