English   

తేజ - సీత ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది !

seetha
2019-01-25 18:49:41

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొన్ని సినిమాలు చేసినా ఒకటీ అరా తప్ప హిట్ లు లేవు. అల్లుడు శీనుతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో జయ జానకి నాయకతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఇదిలా ఉంటే తాజాగా తేజ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. కవచం తర్వాత కాజల్ అగర్వాల్ తో మరోసారి జట్టుకట్టిన ఈ హీరో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతూన్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పేరు ఇప్పటిదాకా ఫైనల్ చేయలేదు. ఆ మధ్య తిరుమల వెళ్ళిన కాజల్ నోరు జారి ఒక పేరు ఖరారు చేసేసింది. మరి తప్పక పెట్టారో మార్చడానికి పెట్టారో కానీ ఈ సినిమాకి కాజల్ లీక్ చేసిన సీత అనే పేరే ఉంచేసారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రేపు ఉదయం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట. ఇది డైరెక్టర్ తేజ, కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో కాగా బెల్లంకొండ, కాజల్ రెండోసారి కిలిసి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ మాటలు అందిస్తుండగా, శీర్ష రే సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. 

More Related Stories