English   

బోయపాటి మిస్సింగ్ !

boyapati-srinu
2019-01-25 11:51:57

బోయపాటి మొదటినుండి మాస్ సినిమాలతోనే పాపులర్ అయ్యాడు. భద్ర మొదలు తులసి, సింహ, లెజెండ్, సరైనోడు, జయ జానకీ నాయక, దమ్ము ఇలా ఏ చిత్రంలోనైనా యాక్షన్ కే అధిక ప్రాధాన్యతనిచ్చి చాలా వరకు హిట్ లు కొట్టాడు బోయపాటి. తాజాగా రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రం మార్నింగ్ షోకే ప్లాఫ్ తెచ్చుకోగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని నిర్మాత డివివి దానయ్య ఒప్పుకుని, డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కి ఇచ్చేసే పనిలో పడ్డారు. సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. ఈ నేపధ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను మిస్సయ్యారు. దీంతో బోయపాటి ఏం చేస్తున్నారు ? ఎక్కడున్నారు? అనే చర్చ నడుస్తోంది. సినిమా మీద దారుణమైన ఫ్లాప్ టాక్ రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని వార్తలు మొదలయ్యాయి. ఎవరితో ఫోన్ లో కూడా టచ్ లో లేడని అంటున్నారు.  అయితే మరి కొందరు మాత్రం బోయపాటి బాలకృష్ణల సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. నిజమేమిటో దేవుడికే తెలియాలి.  

More Related Stories