English   

సుకుమార్ సినిమాలో రఫ్ లుక్ లో మహేష్ !

Mahesh
2019-01-25 18:59:58

మహేష్‌ బాబు జోరు పెంచేశాడు ఒకప్పుడు చాలా ఆలశ్యంగా సినిమాలు తీస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచేసి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహర్షి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మహర్షి తర్వాత విలక్షణ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నారు మహేష్‌బాబు. ఈ సినిమా మొత్తం ఇన్వెస్టిగేషన్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోతోందనే ప్రచారం జరిగినా సుకుమార్ మాత్రం మహేష్ తో ఒక స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో సినిమా చెయ్యబోతున్నాడట. అలాగే ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెడ్డం మీసాలతో కొత్త లుక్ తో కనిపించాడు. ఆ తరువాత సుకుమార్ గ్రామీణ నేపథ్యంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం' సినిమా చేశాడు. పెరిగిన గెడ్డంతో చరణ్  ఈ సినిమాలో కనిపించారు. ఇక మహేష్ తో సినిమాలో మహేష్ పాత్ర ఏమిటనే విషయం తెలియదు గానీ, పెరిగిన గెడ్డంతో రఫ్ లుక్ తో కనిపిస్తాడనే మాత్రం వినిపిస్తోంది. సాధారణంగా మహేశ్ బాబు స్మార్ట్ గా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు, కానీ సినిమా కధా పరంగా ఖచ్చితంగా రఫ్ఫ్ లుక్ లో ఆయన కనిపించాల్సిందే అని సుకుమార్ కోరడంతో ఆయన అదే లుక్ లో కనిపించనున్నారట.
 

More Related Stories