English   

హిందీ అర్జున్ రెడ్డి షూట్ లో ప్రమాదం...వ్యక్తి మృతి !

Man dies at Arjun Reddy sets
2019-01-25 21:04:31

తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్‌, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో తీసిన సందీప్ రెడ్డి వంగా హిందీలో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముస్సోరిలో జ‌రుగుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచరం ప్రకారం ఈ సినిమా సెట్‌లో ప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తి మృతి చెందారట. డెహ్రాడూన్‌ లోని ముస్సోరీలో షూటింగ్‌ జరుగుతుండగా ప్రొడక్షన్ కి చెందిన రాము కుమార్ అనే వ్యక్తి జ‌న‌రేట‌ర్‌లో ఆయిల్ చెక్ చేసేందుకు వెళ్ళ‌గా ఆయ‌న మ‌ఫ్ల‌ర్ జ‌న‌రేట‌ర్ వీల్‌కి చిక్కుకుంది. ఆ ఫోర్స్ కి రాము త‌ల కూడా జ‌న‌రేట‌ర్ లోకి వెళ్ళిపోగా, అత‌ని త‌ల‌కి బ‌ల‌మైన గాయాలు అయ్యాయి. ఈ విష‌యాన్ని గుర్తించిన యూనిట్ వెంట‌నే షూట్ ఆపేసి ఆయన్ని డెహ్రడూన్‌లోని మ్యాక్స్ హాస్పిట‌ల్‌ కి త‌ర‌లించారు. త‌ల‌కి గాయం బ‌లంగా త‌గ‌ల‌డంతో అత‌ను మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సాయం చేసినట్టు సమాచారం.

More Related Stories