English   

రవితేజ డిస్కోరాజా....సర్ప్రైజ్ !

Ravi-Teja
2019-01-26 05:22:58

రాజా ది గ్రేట్ చిత్రం త‌ర్వాత రవితేజాకి స‌రైన హిట్ ప‌డ‌డం లేదు. ఆ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్ ఇక రీసెంట్‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చినా అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ప్ర‌స్తుతం ఆయన ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ రోజు ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు. గ‌త కొన్నిరోజులుగా ప్ర‌చారం అవుతున్న డిస్కోరాజా అనే టైటిల్‌నే సినిమాకి ఫిక్స్ చేశారు. లోగో పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. గతంలో ఈ దర్శకుడు చేసిమన ఒక్క క్షణం సినిమా టైటిల్ లోగో కూడా ఒక పజిల్ లా రిలీజ్ చేసిన దర్శకుడు ఈ సినిమా లోగోను కూడా అలాగే వదిలాడు. చుట్టూ సీతాకోక చిలుక డిజైన్ లో డిస్కోరాజా టైటిల్ ను ఇమిడ్చి, రెండు బాషల అక్షరాల్లో వివిధ రకాల సంకేతాలు అందించే ప్రయత్నం చేసారు. అంతేకాకుండా రివైడ్, ఫార్వార్డ్, ఆ తర్వాత ప్లే తీసేసి కిల్ అంటూ పేర్కొనడం కూడా కాస్త ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ సినిమాలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషించ‌బోతున్నాడు. తండ్రీ – కొడుకులుగా క‌నిపించ‌బోతున్నాడని అంటున్నారు. 80ల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో రవితేజ డిస్కో డ్యాన్సర్‌గా కనిపిస్తాడట. ఈ నేపధ్యంలో రవితేజ పాత్రకు తగ్గట్లుగా టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ నటుడు బాబీ సింహా ఓ ప్రతి నాయక పాత్ర పోషించబోతున్నాడని తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబరు నుంచి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు.  
 

More Related Stories