English   

నువ్వు దేవత తల్లి.. సాయిపల్లవిపై ప్రశంసల వర్షం..

Sai-Pallavi
2019-01-26 07:13:12

ఈ రోజుల్లో హీరోయిన్లు బాగా కమర్షియల్ అయిపోయారు. ఒక సినిమాకు సైన్ చేసే ముందు ఎన్ని కోట్లు తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. డబ్బులు ఇవ్వకపోతే డేట్స్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతారు. అలాంటి హీరోయిన్ల మధ్య సాయి పల్లవి చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ మధ్య శర్వానంద్ తో ఈమె నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఊహించిన విధంగా పరాజయం పాలయింది. ఈ సినిమా కోసం ఆమెకు దాదాపు కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంది నిర్మాతలు. అయితే విడుదలకు ముందే 60 లక్షలు ఇచ్చిన నిర్మాతలు మరో 40 లక్షలు మాత్రం బ్యాలెన్స్ పెట్టారు. విడుదల తర్వాత అవి ఇవ్వాలనుకున్నారు వాళ్లు. సినిమా ఫ్లాప్ కావడంతో సాయి పల్లవి కూడా మిగిలిన డబ్బుల కోసం ఆశపడలేదు. అయితే నిర్మాతలు మాత్రం ఆమె ఇంటికి వెళ్లి 40 లక్షలు తీసుకోవాల్సిందిగా కోరారు. సినిమా పరాజయం పాలవడంతో వద్దు అని చెప్పింది సాయి పల్లవి. కానీ నిర్మాతలు మాత్రం పట్టుబట్టి ఎలాగోలా తీసుకోవాలని వాళ్ల తల్లిదండ్రులకు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికీ వాళ్ళు తీసుకోలేదు.. సాయి పల్లవి మంచితనం చూసి అందరు నిజంగానే ఫిదా అయిపోయారు. ఇక కచ్చితంగా ఎంతో కొంత మొత్తం తీసుకోవాల్సిందే అని నిర్మాతలు మరోసారి ప్రయత్నించగా.. 20 లక్షల రూపాయలు తన పేరు మీద సాయి బాబా ఫౌండేషన్ కు ఇవ్వాల్సిందిగా చెప్పింది సాయి పల్లవి. ఈమె మంచితనం చూసి నిర్మాతలతో పాటు అంతా ఈమెకు అభిమానులు అయిపోతున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి హీరోయిన్లు దొరకడం నిజంగానే అరుదు.

More Related Stories