English   

వాఘా బోర్డర్ లో యూరి యూనిట్ సంబరాలు !

URI
2019-01-26 14:42:04

గతంలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రమొకటి తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2016 సెప్టెంబర్ 18న కాశ్మీర్ యురి సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపు మీద టెర్రరిస్టులు దాడి చేయగా దానికి ప్రతీకారంగా సెప్టెంబరు 29 న ఇండియన్ ఆర్మీ పాక్ టెర్రరిస్ట్ శిబిరాల మీద సర్జికల్ స్ట్రైక్‌కి చేసింది. ఆ వాస్తవిక సంఘటనకు దృశ్యరూపం ఇస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య దార్ ' యురి ది సర్జికల్ స్ట్రైక్ ' అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఆయ‌న స‌ర‌స‌న యామీ గౌత‌మ్ క‌థానాయిక‌గా న‌టించింది. విక్కీ కౌశ‌ల్‌ పాకిస్థాన్ టెర్ర‌రిస్ట్‌ల‌ మీద స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసే టీం క‌మాండ‌ర్ చీఫ్ పాత్ర‌లో క‌నిపించి ఆకట్టుకున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ఏకంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ సినిమా చూసి ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర బృందంపై ప్ర‌శంసలు కురిపించాడంటే అది ఎంత ఉద్వేగభరితంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ రోజు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా చిత్ర ప్ర‌ధాన పాత్ర ధారులు విక్కీ కౌశ‌ల్ , యామి గౌతమ్ వాఘా బోర్డ‌ర్ వద్ద జ‌రిగే రిప‌బ్లిక్ డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొంటున్నారట. అయితే ఇదొక ప్రమోషన్ స్టంట్ లా కాకుండా వారు దేశ భక్తితోనే అక్కడికి వెళుతున్నారని యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

More Related Stories