English   

పూరి ఈజ్ బ్యాక్.. ఇస్మార్ట్ శంకర్ పై భారీ ఆశలు..

Puri-Jagannadh
2019-01-26 08:17:26

కొందరు దర్శకుల చేతిలో నిజంగానే ఏదో మంత్రదండం ఉంటుంది. వాళ్లు ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా హీరోలు ఇంకా వాళ్ల దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగానే ఉంటారు. అలాంటి వాళ్లలో పూరి జగన్నాథ్ కూడా ఒక్కడు. ఈయన ఈ మధ్య కాలంలో చేసిన ఈ ఒక్క సినిమా కూడా పట్టుమని పది రోజులు ఆడలేదు. అలాంటి దర్శకుడితో ఇప్పుడు హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కేవలం ఐదు నెలల్లో పూర్తి చేసి మే లేదంటే జూన్ ఇస్మార్ట్ శంకర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో కూడా తెలియక ముందే దీనికి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ మధ్య ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ismart శంకర్ కోసం భారీ మొత్తం పూరి జగన్నాథ్ కు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అయితే సినిమా పై నమ్మకంతో ఈయన ఎవరికి అమ్మకుండా సొంతంగా విడుదల చేయాలని చూస్తున్నాడు. కథ బాగా వచ్చింది కాబట్టి పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని. ఈ సినిమాలో రామ్ సరసన అను  హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. మొత్తానికి ఏదో మాయ చేసాలా కనిపిస్తున్నాడు. మరి చూడాలిక ఈ సినిమా అయినా పూరి జాతకాన్ని మారుస్తుందో లేదో..
 

More Related Stories