English   

ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి !

Anil-Ravipudi
2019-01-26 11:10:39

సాధారణంగా ఒక సినిమా హిట్ కొడితే ఆ డైరెక్టర్ కు నిజంగా ఆఫర్ చేస్తారో లేదో తెలీదు కానీ ప్రతి హీరో నుండి ఫోన్ వచ్చిందనే చెబుతారు. తాజాగా ఎఫ్2 హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అదే చెబుతున్నాడు. తనకు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందని సమయం తక్కువ ఉండడంతో అది చేజారిందని చెప్పుకొచ్చాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ హ్యాట్రిక్ విజయాల తర్వాత ‘ఎఫ్2’తో రెండో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టిన అనిల్‌ మీద ప్రస్తుతం అంచనాలున్నాయి. ఈ అంచనాలకు బలికాకుండా తాను అనుకున్నట్టే తన కెరీర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడట. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు తీసేందుకు సిద్ధపడుతున్నాడట. అయితే బాలయ్యకు అనిల్ కధ చెప్పినట్టు బాలయ్యే స్వయంగా చెప్పగా ఇప్పుడు ఈ దర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని అనిల్ చెప్పడమే. పటాస్ విజయం సాధించడంతో కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్‌కు పరిచయం చేశారని అప్పుడు చెప్పిన ఓ స్టోరీ లైన్‌కు ఆయన ఇంప్రెస్ అయ్యారని, దీన్ని కథగా డెవలప్ చేయి సినిమా తీద్దామని అన్నారని కానీ సమయం తక్కువగా ఉండటంతో కథ రెడీ చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఆయన ‘జై లవకుశ’ సినిమాతో బిజీ అయిపోయారని అందుకే ఎన్టీఆర్‌తో సినిమా తీయలేకపోయానని కానీ భవిష్యత్తులో ఆయనతో సినిమా కచ్చితంగా తీస్తానని అనిల్ చెప్పుకొచ్చాడు. 
 

More Related Stories