సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్ !

2013లో అలియాస్ జానకి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి అనీషా ఆంబ్రోస్ ఆ తర్వాత ‘గోపాల గోపాల’, ‘మనమంతా’, ‘ఒక్కడు మిగిలాడు’ లాంటి సినిమాల్లో నటించినా ఆమెకి అవకాశాలు రాలేదు చివరిగా ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంతో ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే పాత్ర చేసింది. పేరు నార్త్ అమ్మాయిలా ఉన్నా ఈమె అచ్చ తెలుగు అమ్మాయే. అయితే తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ భాషలలోను నటించిన అనీషా గత నెలలో గుణ అనే వ్యక్తితో రహస్యంగా నిశ్చితార్ధం జరుపుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ నిశ్చితార్ధానికి కేవలం సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరైనట్టు చెబుతున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుందని తెలుస్తుండగా, తాజాగా నిశ్చితార్ధానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం సెవన్ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనీషా. ఇందులో రెజీనా, నందిత శ్వేత, అదితి ఆర్య, పూజిత పొన్నాడ, త్రిధ చౌదరిలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ బైలింగ్యువల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, త్వరలోనే థియేటర్స్‌లోకి రానుంది.