English   

ఆ నటి చనిపోయిందా....క్లారిటీ ఇచ్చిన షకీలా !

shakeela gives clarity on malayalam star reshma death rumours
2019-01-26 18:39:59

మలయాళ శృంగార చిత్రాలల్లో నటించిన రేష్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమె చనిపోయిందంటూ వదంతులు కొద్దిరోజులుగా మలయాళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. షకీలాతో సమానంగా ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన రేష్మ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో 12 ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ తన సహ నటులను కూడా కలవక పోవడంతో ఆమె మరణించింది అంటూ పుకార్లు మొదలయ్యాయి. తాజాగా షకీలా బయోపిక్ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ చిత్రంలో రేష్మ పాత్ర కూడా ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆమె మరణానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. షకీలా కూడా ఒకప్పుడు శృంగారతారే అయినా ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. అయితే రేష్మకి అలా ఆఫర్లు రాకపోవడంతో అదృశ్యం అయిపొయింది. 2007లో ఓ సెక్స్ రాకెట్ కేసులో చిక్కుకుని బెయిలుపై విడుదలైన రేష్మ ఆ తర్వాత నుంచి కనిపించ లేదు. మిస్టరీగా మారిన ఆమె అదృశ్యంపై తాజాగా షకీలా స్పందించింది. రేష్మ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, మైసూరులో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టింది. 

More Related Stories