English   

ప్రియా ప్ర‌కాశ్ టాలీవుడ్ ఎంట్రీకి ఒప్పుకుందా ?

Priya Prakash Varrier make her Tollywood debut opposite Nani?
2019-01-27 09:21:23

క‌న్నుగీటుతో కుర్రోళ్ళ హృద‌యాల‌ని కొల్ల‌గొట్టిన అందాల భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఒరు ఆదార్ ల‌వ్ అనే మళయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి దీనిపై క్లారిటీ రావ‌డం లేదు. బ‌న్నీతో సినిమా చేయ‌నుంద‌ని వార్త‌లు రాగా, తాజాగా నాని సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంద‌ని అంటున్నారు. నాని ప్ర‌స్తుతం ‘మళ్లీరావా’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుండగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అనుకుంటుండగా దాని తర్వాత నాని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ ని ఒక క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నారట. ప్రియా కూడా నాని సరసన నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు భామలతో నాని రోమాన్స్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తన మొదటి టాలీవుడ్ సినిమాకి అంత మందిలో ఒకామెగా కనిపించడానికి ప్రియ ఒప్పుకుంటుందా ? అనేది ఆమె అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు. 

More Related Stories