English   

మోహన్ బాబు ఐదు గజాల స్థలం ఎవరిని అడిగారు ?

Actor mohan babu sensational comments on trs over dasari narayana rao statue issue
2019-01-27 16:41:00

దర్శక రత్న దాసరి సొంతూరులో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆయన శిష్యుడు ప్రముఖ నటుడు మోహన్ బాబుశనివారం ఆవిష్కరించారు. దాసరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహావిష్కరణకు మోహన్ బాబుని పిలిచారు. విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. దాసరి నారాయణరావు స్మారకంగా సొంతూరులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన ఎంతో సేవ చేసిన హైదరాబాద్‌ లో మాత్రం విగ్రహం కోసం ఐదు గజాల స్థలం కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. భక్తవత్సలం నాయుడుగా ఉన్న తనకు మోహన్‌ బాబుగా పేరుపెట్టి హాస్యనటుడిగా, విలన్‌గా, కథానాయకుడిగా అనేక అవకాశాలిచ్చి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన దాసరిని చిత్రసీమకు అందించిన ఘనత పాలకొల్లుదని పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర కథానాయకులతో నటించే అవకాశంతో పాటు రకరకాల పాత్రలు ఇచ్చి, మంచి నటుడిగా తీర్చిదిద్దారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మోహన్‌బాబు సత్కరించడానికి ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు. అయితే ఎవరు ఎప్పుడు ఎక్కడ ? దాసరి విగ్రహానికి అనుమతులు అడిగారు అనేది ఆయన ప్రస్తావించలేదు. ఇప్పయికే ఫిలిమ్ నగర్ దైవ సన్నిధానం దగ్గర దాసరి విగరహం ఉంది, మరి మోహన్ బాబు చెబుతున్న ఐదు గజాల స్థలం ఎవరిని అడిగారు ? ఎప్పుడు అడిగారు ? ఎక్కడ అడిగారు అనేది తెలియాల్సి ఉంది.

More Related Stories