English   

సంచ‌లన పాత్ర‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సాయిప‌ల్ల‌వి..

sai pallavi may act naxalite virata parvam 1992 directed venu udugula
2019-01-27 10:21:08

పడి పడి లేచే మనసు తర్వాత సాయి పల్లవి ఇమేజ్ తెలుగులో కాస్త తగ్గిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈమె మరో సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఏకంగా గన్ను పట్టుకుని నక్సలైట్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సాయిపల్లవి. నక్సలైట్ గా సాయిప‌ల్ల‌విని ఊహించుకోవడం కాస్త కష్టమే అయినా కూడా దర్శకుడు వేణు ఊడుగుల మాత్రం తన క‌థ‌తో ఈమెను మెప్పించాడు. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్క‌నుంది. దాని కంటే ముందుగానే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకున్నా కూడా ఇందులో రానా మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఆయ‌న‌ డేట్స్ వాళ్లకు దొరకడం లేదు.. ఆయన కోసం వేచి చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు విరాటపర్వం 1992 అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
కచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో మరో సంచలనం సాయిపల్లవి సృష్టిస్తుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు. మరోవైపు ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని.. రానా ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జూన్ నుంచి సినిమాను పట్టాలెక్కించి ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నీది నాది ఒకే కథ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తర్వాత వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమాతో తన కెరియర్ మరో మలుపు తిరుగుతుందని ఆశిస్తుంది సాయిపల్లవి. మరి వీళ్ళ నమ్మకం విరాట‌ప‌ర్వం సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

More Related Stories