English   

వాల్మీకి మొద‌లైంది.. హ‌రీష్ శంక‌ర్ ఏం చేస్తాడో..?

Varjun Tej and Harish Shankar's film titled Valmiki
2019-01-27 10:44:06

ఎట్టకేలకు హరీష్ శంకర్ కొత్త‌ సినిమా మొదలు పెట్టాడు.. డిజె సినిమా తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఒక రెండు మూడు సినిమాలు వర్కౌట్ చేయాలని బాగానే ప్రయత్నించాడు కానీ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. స్టార్ హీరోలు హ్యాండ్ ఇచ్చేసరికి హరీష్ శంకర్ కు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కొన్ని రోజులు. ఎందుకో తెలియదు కానీ హీరో కూడా ఈయ‌న్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో కొన్నాళ్లు మాయమైపోయాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాల్మీకి అంటూ కొత్త సినిమా మొదలు పెట్టాడు. తమిళనాట విజయం సాధించిన జిగ‌ర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్, రష్మిక మందన్న ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం తన కెరీర్ గాడిలో పడాలంటే కచ్చితంగా ఈ సినిమా విజయం సాధించాలి. గబ్బర్ సింగ్ తర్వాత ఆ స్థాయి విజయం హరీష్ శంకర్ కు రాలేదు.
సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే లాంటి సినిమాలు జస్ట్ ఓకే అనిపించాయి కానీ సూపర్ హిట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఈయనను స్టార్ హీరోలు నమ్మాలి అంటే కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. అందుకే వాల్మీకి పని మొదలు పెట్టాడు హరీష్ శంకర్. ఈ సినిమా ఖచ్చితంగా తాను కోరుకున్న విజయం తీసుకొస్తుందని ధృడంగా నమ్ముతున్నారు హరీష్. ఇదే ఏడాది ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నాడు హ‌రీష్. గోపీనాథ్ ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ వాల్మీకి సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. వరుస విజయాలతో దూసుకుపోతున్న వ‌రుణ్ తేజ్ ఈ సినిమాతో మరో విజయం అందుకుంటారని ధీమాగా చెబుతున్నాడు. దానికి తోడు మెగా హీరోలు హరీష్ శంకర్ కు బాగానే కలిసి వచ్చారు.

 

More Related Stories