English   

కంగన చాలా మూర్ఖంగా, తప్పుగా ప్రవర్తించారు ...క్రిష్‌ కామెంట్స్

director krish done sensational comments on kangana ranaut
2019-01-27 19:21:04

క్రిష్ దర్శకత్వంలో కంగన రనౌత్ నటించిన మణికర్ణిక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుండి మంచి టాక్‌ తో నడుస్తుండగా ఈ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసారు ఈ సినిమా మొదటి దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ సినిమా దర్శకత్వం వచించే అవకాసం క్రిష్ కి రావడం వలన సినిమాకు సంబంధించిన కొంత భాగానికి కంగన దర్శకత్వం వహించారు. అయితే వాళ్లిద్దరి మధ్యా చాలా గ్యాప్ అయ్యిందని, అందుకే క్రిష్ తప్పుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఎంతవరకూ నిజం ఉందనే విషయమై క్రిష్ స్పందించారు. సినిమా రిలీజ్ కోసం ఉండడంతో ఇంతకాలం ఎక్కడా నోరు జారకుండా చాలా సైలెంట్ గా ఉన్న క్రిష్, రిలీజ్ అయ్యాక ఈ విషయాల మీద స్పందించాడు. దర్శకుడిగా ఆయన పేరు పక్కన కంగనా రనౌత్‌ తన పేరు చేర్చటానికి గల కారణం, ఇద్దరికీ మధ్య జరిగిన వివాదం వివరించారు. హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆమే తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించిందని చెప్పారు. గత ఏడాది జూన్‌కే మణికర్ణిక సినిమా మొత్తం ఎడిటింగ్‌ పూర్తయిందని అందరి నటులు డబ్బింగ్‌ కూడా పూర్తి అయ్యిందని కేవలం కంగన మాత్రం డబ్బింగ్‌ చెప్పాల్సి ఉందని కానీ, అప్పుడు ఆమె మెంటల్‌ హై క్యా సినిమా షూట్‌ కోసం లండన్‌లో ఉన్నారని లండన్‌ నుంచి తిరిగొచ్చిన కంగన సినిమా చూసి తనకు నచ్చిందని చెప్పారు. కానీ కొన్ని చిన్న మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారని క్రిష్ తెలిపారు. ఇది మార్చండి అది మార్చండి అంటూ కంగన సినిమా మొత్తం మార్పులు చేసుకుంటూ వచ్చారని క్రిష్ తెలిపారు. అంతే కాకుండా నిర్మాత కమల్‌ జైన్‌ ‌కు సినిమా నచ్చలేదని తనతో అన్నారని చెప్పారు. క్రిష్ పనితనం జీ స్టూడియోస్‌కు నచ్చలేదని కంగన నమ్మించారని ఇది ఓ భోజ్‌పూరి సినిమాలా ఉందన్నారని కంగనా తనతో చెప్పారని అది విని గట్టిగా నవ్వానని ప్రజలకు నా పనితనం ఏంటో తెలుసని చెప్పానని ఈ విషయంలోనూ తమ మధ్య వాదన జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కంగన ఉన్నట్టుండి సోనూసూద్‌ పాత్ర ఇంటర్వెల్ కి చనిపోవాలన్నారని కానీ ఇలా చేస్తే చరిత్రను వక్రీకరించడమే అవుతుందని నేను చేయనని చెప్పానని ఈ విషయంలో కూడా మా మధ్య పెద్ద వాదన జరిగిందని క్రిష్ చెప్పుకొచ్చారు.  ఓ మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయడం ఇష్టంలేకే సోనూ సినిమా నుంచి తప్పుకున్నారని కంగన మీడియాతో గతంలో అన్నారని ఆమె అలా చెప్పడం సరికాదని అన్నారు. కంగన చెప్పింది అబద్ధమని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నందుకు సోనూను నేను విమర్శించను. అతడి పాత్ర రన్‌టైమ్‌ 100 నిమిషాలు. కానీ, దాన్ని 60 నిమిషాలకు కట్‌ చేశారు. ఇలా చేస్తే ఎవరు ఒప్పుకుంటారని క్రిష్ ప్రశ్నించారు. ఈ విధంగా చాలా సార్లు కంగన చాలా మూర్ఖంగా, తప్పుగా ప్రవర్తించారని క్రిష్‌ అన్నారు.  

More Related Stories