English   

కంగ‌న ముందు హీరోలంతా వేస్ట్.. ఆమె నా హీరో..

ramgopal varma praises kanganaranaut
2019-01-27 19:48:55

వర్మ ఓ సినిమాలు చూడటం.. దాన్ని పొగడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రతి సినిమాపై సెటైర్లు వేయడం మాత్రమే ఆయ‌న‌కు తెలుసు. అయితే ఇప్పుడు మణికర్ణిక సినిమాను చూసిన వర్మ అద్భుతం అంటూ పొగిడేశాడు. అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది కానీ దానికంటే కాస్త ముందుకు వెళ్ళాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడే మ‌ణిక‌ర్ణిక సినిమా చూశాను.. చూసిన వెంటనే కంగనా రనౌత్ కి ఫ్యాన్ అయిపోయాను అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక సూపర్ స్టార్ ను అక్క‌డ చూసాన‌న్నాడు. ఆమె నా హీరో అంటూ కంగనా రనౌత్ ను ఎవ‌రెస్ట్ ఎక్కించ‌కేసాడు వ‌ర్మ‌. ఇది కూడా బాగానే ఉంది ఆ తర్వాత అసలు చర్చ మొదలైంది.
కంగ‌న ర‌నౌత్ న‌ట‌న‌ను  చూస్తుంటే తన దృష్టిలో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న‌ హీరోలు మొత్తం హీరోయిన్ ల‌లా మారిపోయారని సెటైర్ వేశాడు వర్మ. త‌న న‌ట‌న‌తో స్టార్ హీరోలను కూడా హీరోయిన్లుగా మార్చేసింది కంగ‌న అంటూ పొగిడేసాడు. ఇది కూడా ఒక రకమైన పొగడ్తే.. అది కేవలం వరకు మాత్రమే సాధ్యమయ్యే పొగడ్త. కంగనా రనౌత్ తన రియల్ హీరో అని.. బ్రూస్లీ సినిమాలో కనిపించిన ఎమోషన్స్ ఈ సినిమాలో తనకు కనిపించాయి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు వ‌ర్మ‌. ఈ మధ్య విడుదలైన కానీ మణికర్ణిక సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనుకబడి ఉంది ఈ చిత్రం. మొత్తానికి వర్మ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అయిపోయాయి.

More Related Stories