అలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పెళ్లిపుస్తకం దివ్యవాణి..

కమెడియన్ అలీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండి.. తన పని తాను చేసుకుంటున్న ఈ కమిడియన్ ఇప్పుడు మళ్లీ సుమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. లవర్స్ డే ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన కావాలని అనకపోయినా కూడా అనుకోకుండా నోట్లోంచి వచ్చిన కొన్ని మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ విషయంపై సీనియర్ నటి దివ్యవాని స్పందించారు. ఒకప్పుడు అలీతో కలిసి ఒక కార్యక్రమం చేశానని.. అప్పుడు తనతో కూడా ఇలాంటి సెటైరికల్ కామెంట్లు చేశాడు అని గుర్తుచేసుకుంది దివ్యవాణి. అయితే నిజానికి అలీ చాలా మంచివాడని.. ఆయన మనసులో ఎలాంటి దురుద్దేశం ఉండదని చెప్పుకొస్తోంది ఈమె.
ఆ టైంకు సరదాగా ఉండాలని.. కామెడీ పండించాలని ఇలాంటి కామెంట్లు చేసి అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవడం అలీకి అలవాటుగా మారింది అంటుంది దివ్యవాణి. తనపై అలాంటి కామెంట్లు చేసినప్పుడు కోపం వచ్చిందని కానీ ఒక సోదరుడు లా భావించి ఆయనను ఏమీ అనలేక పోయాను అని గుర్తు చేసుకుంది ఈమె. ఇదే సమయంలో సుమాకు కూడా అలా కామెంట్ చేసినప్పుడు మాకు కూడా మనసులో అతన్ని నరికేయాలి అనేంత అంత కోపం వచ్చి ఉంటుందని.. కానీ అంతమంది ముందు బయట పడలేదు కదా అని చెప్పింది దివ్యవాణి. ఏదేమైనా తాను చేస్తున్న ఇలాంటి కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో గౌరవం తగ్గిపోతుంది అని అలీ గుర్తు పెట్టుకోవాలి అంటుంది దివ్య. ఈమె మరి ఇప్పటికైనా అలీ నోరు దగ్గర పెట్టుకుంటాడో లేదో చూడాలి.