English   

కన్ఫ్యూషన్ లో పడేసిన వరుణ్ తేజ్ !

Varun tej act valmiki which remake jigarthanda
2019-01-27 21:20:57

‘ఎఫ్2’ సూపర్ హిట్ కావడంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తర్వాతి సినిమా పై ఆసక్తి నెలకొంది. ఆయన కెరీర్ ఇప్పుడే కాస్త కుదుటపడడంతో హరీష్ శంకర్ జిగర్తాండ సినిమాలో చేయరని వార్తలు వచ్చాయి. నిజానికి ఇందులో తమిళ్ బాబీ సింహా పోషించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాల్సి రావడంతో హీరో ఇమేజ్ కి దెబ్బ పడుతుందని ఆయన చేయడేమో అని వార్తలు వచ్చాయి. దీంతో ఇక తర్వాతి సినిమా ఎవరి దర్శకత్వంలో చేస్తాడనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తర్వాతి సినిమాకు సంబంధించి వరుణ్ నుంచి అధికారిక సమాచారమేమీ లేదు. అయితే నిన్నఒక ప్రకటన వెలువడింది. ఈరోజు హారీష్ శంకర్ వరుణ్ తేజ్ సినిమా ఓపెనింగ్ రామా నాయుడు స్టూడియోస్ లో లాంచ్ ఉంటుందని ఆ ప్రకటన సారాంశం. అయితే ఒకవేళ జిగార్తాండా సినిమా అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండాల్సి రావడం ఇక్కడేమో ఒకరి పేరే ఉండడంతో కాస్త అనుమాలు వ్యక్తం అయ్యాయి. అయితే వాటికి క్లారిటీ ఇవ్వకుండానే ఈరోజు సినిమా టైటిల్ రివీల్ చేసేశారు వరుణ్ తేజ్. తన తర్వాతి సినిమా అంటూ వాల్మీకి పోస్టర్ విడుదల చేశాడు వరుణ్. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఆ తమిళ సినిమా రీమేక్ ఏనా ? లేక మరో లైన్ ఆ అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

More Related Stories