English   

కొర‌టాల‌-చిరంజీవి సినిమాలో హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

Tamannaah Bhatia to act with Chiranjeevi in Koratala Siva's next?
2019-01-27 21:42:05

చిరంజీవి కొరటాల సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాపై ఉన్న అనుమానాలను కూడా నిర్మాత రామ్ చరణ్ నివృత్తి చేశాడు. ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసి సైరా సినిమా తర్వాత ఈ చిత్రం తెరకెక్కబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు మెగా వార‌సుడు. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. దీనికి సమాధానం మరోసారి సైరా హీరోయిన్లు నటించబోతున్నారు అని తెలుస్తోంది. కొరటాల సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటించబోతుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. కథ నచ్చడంతో నయన కూడా ఓకే చెప్పేసింది. దానికి తోడు పారితోషికం కూడా భారీగా అందుతుండటంతో నయనతార సై అనేసింది. ఇక మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది.
సైరాలో ఈ ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మళ్లీ తన సినిమాలో కూడా వీళ్ల‌నే రిపీట్ చేయాలని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొరటాల శివ. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. ఈ చిత్రం నిరుద్యోగం నేప‌థ్యంలో తెరకెక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ప్రభుత్వంపై సెటైర్లు వేసే విధంగా ఈ పాత్రను కొరటాల డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాన‌ని కనిపిస్తున్నాడు మెగాస్టార్. అన్ని కమర్షియల్ హంగులతో కొరటాల శివ, చిరంజీవి సినిమా రాబోతుంది. ఈ ఏడాది సమ్మర్లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. మొత్తానికి చూడాలి చిరంజీవితో కొరటాల శివ సినిమాలో ఎవరు జోడి కట్టబోతున్నారో..?

More Related Stories