English   

విన‌య విధేయ రామ రెండు వారాల క‌లెక్ష‌న్లు ఎంతంటే..

vvr two weeks box office collections
2019-01-28 08:15:44

విన‌య విధేయ రామ విడుదలై రెండు వారాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 62 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా 35 కోట్లు వెనుకబడి ఉంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా వసూలు చేసిన రామ్ చరణ్.. ఓవర్సీస్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసాడు. అక్కడ బోయపాటి రామ్ చరణ్ సినిమా 2 కోట్లు కూడా వసూలు చేయలేదు. దాంతో దారుణమైన పరాజయం తప్పలేదు. ఇప్పటికే చాలా చోట్ల వినయ విధేయ రామ ప్రయాణం ముగిసింది. విడుదలైన రెండు రోజుల తర్వాత థియేటర్లలో జనాలు లేరంటూ సెటైర్లు మొదలయ్యాయి. అయితే 11 రోజుల్లోనే ఈ సినిమా 60 కోట్ల షేర్ అందుకుంది. మాస్ సినిమాలకు ఉండే పవర్ కూడా ఇదే. దానికితోడు రామ్ చరణ్ స్టామినా ఈ సినిమాకు కలిసివచ్చింది. బీ,సీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకునే ఫైట్లు ఉండటంతో సినిమాను కొన్ని రోజుల పాటు బాగానే ఆదరించారు ప్రేక్షకులు. అందుకే 60 కోట్ల‌కు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమా ఫుల్ ర‌న్ పూర్తి కావడంతో నష్టాలు కూడా ఖరారు అయిపోయాయి. ఎవరిని ఎంతెంత ముంచుతుందో మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నమ్మి అడ్డంగా మునిగిపోయాడు రామ్ చరణ్.

More Related Stories