English   

బీజీపీలో చేరిన వర్మ హీరోయిన్ !

Bollywood actor Isha Koppikar joins BJP to head women transport wing
2019-01-28 03:37:36

బాలీవుడ్ నటి, అలనాటి హీరోయిన్ ఇషా కొప్పికర్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కాషాయ కండువాను ఆమెకు కప్పిన గడ్కరీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వెంటనే ఆమెను బీజేపీ విమెన్ ట్రాన్స్ పోర్ట్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2002లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇషా, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కంపెనీ' చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యారు. తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాల్లో కనిపించారు. బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి సిద్ధమని ఆమె పేర్కోన్నారు. అయితే నియర్‌ నటి మౌసమీ చటర్జీ పశ్చిమ బంగాలో భాజపాలో చేరారు. నటి రూపా గంగూలీ కూడా 2015లో భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. ఇక తాజాగా నటి మాధురీ దీక్షిత్ కూడా బీజేపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. 2019లో ఎన్నికల్లో ఆమెకు ఎంపీగా అవకాశం ఇవ్వబోతోందని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

More Related Stories