English   

కుర్ర శర్వానంద్ కావలెను !

Sharwanand
2019-01-28 10:41:31

చాలా రోజులుగా సినీ ప్రపంచంలో నలుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరకనుంది. అదేం లేదండీ ఎట్టకేలకు 96 మూవీ రీమేక్‌పై క్లారిటీ వచ్చింది. ఈ తమిళ సినిమా రీమేక్ హక్కులు కొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నట్టు అఫీషియల్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకత్వ వివరాలను తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. సమంత, శర్వానంద్ జోడీగా ప్రొడక్షన్ నెం. 34గా ఈ చిత్రాన్ని తమిళంలో మాతృకని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకి సంబందించిన మరో అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాని తమిళ్ లో చుసిన వారికీ లేదా ఆ పోస్టర్స్ చుసిన వారికి అందులో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు శర్వానంద్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం వేటలో పడింది దిల్ రాజు టీమ్. కొద్ది సేపటి క్రితం దానికోసం ఒక క్యాస్టింగ్ కాల్ ఇచ్చింది. పద్నాలుగు నుండి ఇరవై సంవత్సరాలు గల బాలురు ఎవరైనా దీనికి ట్రై చేయచ్చు.  తమిళంలో 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 55.5 కోట్లకుపైగా వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే విమర్శకుల ప్రసంశలు కూడా అందుకుంది.

More Related Stories