English   

రామ్ కోసం ఆ ఇద్దరు !

Nidhhi-Agerwal-Nabha-Natesh
2019-01-28 04:16:41

వరుస ప్లాప్స్ తో జోరు తగ్గిన పూరి, దాదాపు అదే పొజీషన్ లో ఉన్న హీరో రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది తన తనయుడు ఆకాశ్‌ హీరోగా తానే డబ్బు పెట్టి మెహబూబా సినిమా తీశారు. అది పరాజయం పాలవ్వడంతో ఏడు నెలలు విరామం తీసుకుని మళ్ళీ ఆయనే డబ్బు పెట్టు రామ్‌ హీరోగా సినిమా మొదలెట్టాడు. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తుండడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు ఘనంగా జరుగగా తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్లను ఫైనల్ చేసారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ మాస్ లుక్ తో డిఫరెంట్ గా కనిపించనుండగా రామ్ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కన్నడ భామలు నిధి అగర్వాల్, నభా నటేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. రామ్ సరసన ఈ ఇద్దరినీ ఫైనల్ ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయనే టాక్ నడుస్తోంది. చైతూకి, అఖిల్ జోడీగా మెరిసిన నిధి అగర్వాల్ కి హిట్ లు మాత్రం పడలేదు కానీ నటన మంచి మార్కులు పడ్డాయి. ఇక అదుగో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా నన్ను దోచుకుందువటేతో పాపులర్ అయ్యింది నభా నటేశ్. మరి వీరిద్దరూ ఫైనల్ అయితే తెర మీద ఏమి మాయ చేస్తారో చూడాలి మరి. 

More Related Stories