English   

ట్రాన్స్ జెండర్ పాత్రలో మెగాస్టార్ !

Amitabh
2019-01-28 06:30:08

రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన కాంచన చిత్రం తమిళ, తెలుగు భాషల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారని సినిమా రిలీజయిన కొన్నాళ్ళకే వార్తలు వచ్చాయి. 2014లోనే ఈ సినిమాని బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నామని తమిళ మాతృకలో శరత్‌కుమార్ చేసిన ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం అమితాబ్ ని, లక్ష్మీ రాయ్ పాత్రను కరీనా కపూర్ ని, లారెన్స్ చేసిన పాత్ర కోసం అజయ్ దేవగన్ ని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. మరి ఏమయ్యిందో ఏమో ఇప్పటకి ఐదేళ్ళు కావోస్తున్నా ఆ సినిమా గురించిన అప్డేట్ లేదు. తాజాగా మళ్ళీ ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది అయితే ఈసారి ఈ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నట్లు శరత్ కుమార్ పాత్రకు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్‌ ను తీసుకున్నట్లు తెలిసింది. నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించడానికి అమితాబ్‌బచ్చన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కరీనాకపూర్ కథానాయికగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమాతో లారెన్స్ బాలీవుడ్ చిత్రసీమలో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన నటిస్తున్న కాల భైరవ సినిమా కూడా తెరకెక్కుతోంది.

More Related Stories