English   

అగ్రహీరోల బాటలోనే నారా రోహిత్ !

Nara-Rohit
2019-01-28 07:06:39

నారా రోహిత్‌, చైతన్య దంతులూరి కలయికలో వచ్చిన చిత్రం ‘బాణం’. తొలి సినిమాతోనే హీరోగా రోహిత్‌కి, దర్శకుడిగా చైతన్యకూ మంచి పేరు తీసుకురావడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఆ తర్వాత సోలో తప్ప రోహిత్ కి చేపుకోదగ్గ హిట్ పడలేదు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాబోతుంది. రోహిత్ సొంత బ్యానర్ ఆరన్‌ మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ప్రీ లుక్‌ పోస్టర్‌ను 2017లో నారా రోహిత్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పినా ఇప్పటి వరకూ దాని మీద అప్డేట్ లేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇది ఒక పీరియాడిక్ సినిమా అని చెబుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఈ చిత్రం సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. 1971 లో సాగే స్టోరీ లైన్ తో ఈ సినిమా ఉంటుందట. ఈ పీరియాడిక్ సినిమా కోసం నారా రోహిత్ తన లుక్ మార్చాల్సి రావడంతో ఎక్కడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ పీరియాడిక్ మూవీతో హిట్ కోటగా, ప్రభాస్ ఒక సినిమా ఒకే చేసి షూట్ చేస్తున్నాడు, రానా విరాట పర్వం చేస్తుండగా, చైతూ మజిలీ చేస్తున్నాడు ఇవన్నీ పీరియాడిక్ మూవీస్ కావడంతో రోహిత్ కూడా వారి బాటలోనే నడుస్తున్నాదేమో ? మరి. బాణంతో హిట్ కొట్టిన రోహిత్, చైతన్య దంతులూరి ఈ సినిమాతో కూడా ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి మరి. 

More Related Stories